'NGK' Telugu Movie 1st Day Collections!! | Suriya | Rakhul | Sai Pallavi

2019-06-01 746

Suriya who has different image and is quite popular with his films 'Gajini' and 'Singam' Series is coming with an interesting political thriller 'NGK' (Nanda Gopala Krishna). Director Sri Raghava is directing this film while SR Prakash Babu, SR Prabhu are producing under Dreamwarrior Pictures along with Reliance Entertainments. This movie released on May 31st and get good response at Box office in TN and overseas.
#ngk collections
#ngkpublictalk
#ngkrtelugureview
#suriya
#rakulpreetsingh
#saipallavi
#sriraghava
#kkradhamohan
#tollywood

దక్షిణాదిలో విలక్షణ హీరో సూర్య నటించిన NGK చిత్రం విడుదలై సినీ విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను ఎదుర్కొంటున్నది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్లు నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకోలేకపోయినప్పటికీ.. తమిళనాడులో భారీ కలెక్షన్లను సాధిస్తుండటం ట్రేడ్ వర్గాలను హుషారెత్తిస్తున్నది. తొలిరోజు ఈ చిత్రం ఎంత వసూలు చేసిందంటే..
NGK మూవీ రిలీజ్ రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నది. దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రహ్మండమైన వసూళ్లు నమోదు చేసుకొన్నది. కేవలం చెన్నై నగరంలోనే తొలి రోజు రూ.1.03 కోట్లు వసూలు చేసింది. సూర్య కెరీర్‌లో చెన్నైలో కోటి రూపాయలు వసూలు చేసిన తొలి చిత్రం అని ట్రేడ్ అనలిస్టు ఎల్ఎమ్ కౌశిక్ ట్వీట్ చేశారు.
NGK చిత్రానికి ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మార్చి 30న అంటే రిలీజ్‌కు ముందు రోజు యూఎస్‌లో ప్రదర్శించిన ప్రీమియర్ల ద్వారా భారీగా వసూళ్లు నమోదయ్యాయి. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం గురువారం రూ.37 లక్షలు, శుక్రవారం రూ.20 లక్షలు వసూలు చేసింది అని రమేష్ బాలా ట్వీట్ చేశారు.